: ఎన్డీయే ర్యాలీలో బీజేపీ కురువృద్ధుడు


కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు అద్వాణీ సైలెంట్ గానే ఉంటున్నారు. ప్రస్తుత రాజకీయాలలో ఆయన చురుకైన పాత్రను పోషించడం లేదు. అయితే, ఈ రోజు ఎన్డీఏ ఎంపీలతో కలసి ఆయన ఢిల్లీ వీధుల్లో నడిచారు. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వారు ర్యాలీ చేపట్టారు. పార్లమెంటులో చేపట్టిన చర్చలకు అనుక్షణం అడ్డుతగులుతూ, సమావేశాలను స్తంభింపజేసిన విపక్షాల తీరును తప్పుబడుతూ వీరు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అద్వాణీ సహా రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, రామ్ విలాశ్ పాశ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News