: జ్వాల, అశ్వినిల జోడీ కూడా దూసుకెళ్లింది!


ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత క్రీడాకారులకు ఎదురేలేకుండా పోయింది. నేడు జరిగిన అన్ని పోటీల్లో భారత ఆటగాళ్లు తదుపరి రౌండ్ లకు దూసుకెళ్లారు. ఈ మధ్యాహ్నం మహిళల డబుల్స్ విభాగంలో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ పోటీల్లో జ్వాలా, అశ్వినిల జోడీ, ఎనిమిదో సీడ్ గా బరిలోకి దిగిన జపనీస్ జోడీపై 21-15, 18-21, 21-19 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. జకార్తాలో జరుగుతున్న ఈ పోటీల్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ లు మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News