: చైనా యువాన్ పతనం భారత్ రూపాయిపై పడుతోంది
అంతర్జాతీయ మార్కెట్ లో భారత్ రూపాయి విలువ పతనమవుతోంది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా నేడు రూపాయి విలువ మరింత పతనమైంది. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. రూపాయి విలువ నేడు 22 పైసలు పతనమైంది. దీనికి కారణం చైనా మార్కెట్ల పతనం, చైనా యువాన్ విలువను తగ్గిస్తోంది. దాని ప్రభావం రూపాయిపై పడుతోంది. దీని కారణంగా డాలర్ తో రూపాయి మారకం విలువ 65.02గా కొనసాగుతోంది. 2013 సెప్టెంబర్ లో డాలర్ తో రూపాయి విలువ 65 రూపాయలను తొలిసారి తాకింది. తరువాత మార్కెట్లు పుంజుకోవడంతో రూపాయి విలువ బలపడుతూ వచ్చింది. గత కొంత కాలంగా నెలకొన్ని ఒడిదుడుకుల కారణంగా రూపాయి మరోసారి రెండేళ్ల కనిష్ఠాన్ని తాకింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గరున్న డాలర్లను అమ్ముతున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రత్యేక కథనం వెలువరిచింది.