: పాము కరిచింది, చికిత్సకు వెళ్తుంటే విధి వెంటాడింది!


పాము కరిచిన తన కొడుకును బతికించుకునేందుకు వెళుతుండగా జరిగిన యాక్సిడెంట్ లో తల్లీ, ఆ కొడుకు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన పగిడాల రేణక ఒక్కగానొక్క కొడుకు రాంచరణ్ (6)ను రాత్రి పాము కరిచింది. ఉదయాన్నే విషయాన్ని గమనించిన తల్లి గ్రామంలోని నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమించిందని, నాగర్ కర్నూల్ తీసుకువెళ్లాలని సలహా ఇచ్చాడు. దీంతో ఓ తుఫాన్ వాహనంలో బిడ్డను తీసుకుని బయలుదేరగా, మరో 10 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా, వాహనం ఎడమ టైరు ఊడిపోయింది. దీంతో అదుపు తప్పిన తుఫాన్ ఎదురుగా వస్తున్న ఇండికాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేణుక, రాంచరణ్ లు అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం డ్రైవర్ క్లీనర్ పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News