: ప్రభుత్వ భవనాలపై సెల్ టవర్ల నిర్మాణానికి కేంద్రం నిర్ణయం


ప్రభుత్వ భవనాలపై టెలికాం సంస్థలు సెల్ టవర్లు పెట్టుకునేందుకు కేంద్ర టెలికాం, పట్టణాభివృద్ధి శాఖలు ఆమోదం తెలిపాయి. అయితే టెలికాం సంస్థలు తగిన మొత్తం చెల్లించి ప్రభుత్వ భవనాలపై టవర్లు నిర్మించుకోవచ్చని చెప్పారు. గత నెల 22న టెలికాం, పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఓ సమావేశంలో సెల్ టవర్ల అంశంపై చర్చించామని చెప్పారు. అప్పుడే సెల్ టవర్లు పెట్టుకునేందుకు అనుమతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్ కు ఈ రోజు లిఖిత పూర్వక సమాధానం తెలిపారు. ప్రతిపాదనలను అంగీకరించేందుకు సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చి ఒకేచోట అనుమతులన్నీ జారీ చేస్తామన్నారు. సెల్ టవర్లకు నిరంతర విద్యుత్ కూడా అందిస్తామని రవిశంకర్ సభకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News