: గుండెపోటుతో వైకాపా సీనియర్ నేత గోపాల్ రావు కన్నుమూత


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోపాలరావు మాస్టారు కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలోని తన నివాసంలో ఆయన మరణించారు. గత రాత్రి నిద్రలో గుండెపోటు వచ్చిన కారణంగా ఆయన తుది శ్వాస విడిచారని వైకాపా వర్గాలు తెలిపాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని ఈ సందర్భంగా కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. గోపాలరావు మాస్టారు మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు పలువురు వైకాపా నేతలు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News