: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ ఎంపీల ఆందోళన
ఎన్డీఏ ఎంపీల ర్యాలీకి పోటీగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని విషయాల్లోనూ మాట తప్పారని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదని, లలిత్ మోదీని కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్థుడైన లలిత్ ను దమ్ముంటే భారత్ కు తీసుకురావాలని సవాల్ విసిరారు. అటు వ్యాపం కేసులో నిందితులను కాపాడుతున్నారన్నారు.