: ధావన్ సెంచరీ... చేరువలో కోహ్లీ
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాలే టెస్టులో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు ఆట తొలి సెషన్ లో దూకుడు కనబర్చిన ధావన్ ప్రస్తుతం 110 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అటు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 86 పరుగులు చేసి సెంచరీకి చేరువలో నిలిచాడు. ఈ జోడీ మూడో వికెట్ కు అజేయంగా 199 పరుగులు జోడించడం విశేషం. ఈ ఢిల్లీ ఆటగాళ్ల ధాటికి లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. దాంతో, లంచ్ వేళకు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 227 పరుగులు చేసింది. తద్వారా లంకపై 44 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లంక తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.