: బాగ్దాద్ లో పేలిన ట్రక్ బాంబు... 52 మంది దుర్మరణం


ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి నెత్తురోడింది. బాగ్దాద్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న సదర్ జిల్లాలో స్థానికంగా ఉన్న ఓ మార్కెట్ లో సంభవించిన ఈ పేలుడులో 52 మంది మృత్యువాత పడ్డారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కులో వచ్చిన ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చివేసుకుని ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. అయితే, గత ఏడాది కాలంగా షియా ముస్లింలను టార్గెట్ చేస్తూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇరాక్ లో మారణహోమం సృష్టిస్తోంది. సదర్ జిల్లాలో షియాలే అత్యధికంగా నివసిస్తున్నారు.

  • Loading...

More Telugu News