: ఎన్టీఆరే ఓడిపోయారు... జాగ్రత్తగా ఉండండి: టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ క్లాసు పీకారు. ఎంతో ప్రజాదరణ ఉండి, ఒక ప్రభంజనంలా ఎన్టీఆర్ గెలిచారని... అయితే, ప్రభుత్వం సరిగా పని చేయకపోవడంతో ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆరే ఓడిపోయినప్పుడు... మనం మరింత జాగ్రత్తగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. ఏ ప్రభుత్వంపైన అయినా సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉంటుందని... అయితే, దాన్ని అధిగమించాల్సి ఉంటుందని తెలిపారు. లేకపోతే, వచ్చే ఎన్నికల్లో కష్టమవుతుందని హితబోధ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ప్రసంగించిన ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News