: చేతబడులు చేస్తున్న రాధేమా... పోలీసులకు ఫిర్యాదు


తాను దైవాంశ సంభూతురాలినని స్వయంగా ప్రకటించుకున్న వివాదాస్పద రాధేమా, క్షుద్రపూజలు, చేతబడులు చేస్తోందని ముంబై పరిధిలోని బొరివాలీ పోలీసు స్టేషనుకు ఫిర్యాదు అందింది. అశోక్ రాజ్ పుత్ అనే న్యాయవాది ఈ కేసు పెట్టారు. ఆమె ప్రజల్లో మూఢ నమ్మకాలను పెంచుతోందని, ఆసభ్యంగా ప్రవర్తిస్తోందని, క్షుద్రపూజలు నిర్వహిస్తోందని ఆరోపించిన ఆయన, మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసి విచారించాలని తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించామని తెలిపిన పోలీసులు, విచారణ, న్యాయపరమైన సలహాలను తీసుకున్న తరువాతే ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం రాధేమాపై విచారణలో ఉన్న వరకట్న వేధింపుల కేసు కోర్టులో నిలవదని, ఈ కేసు అత్యంత బలహీనంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News