: ముందస్తు ఎన్నికలు ఉండవు: కేంద్ర మంత్రి మనీష్
లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ వినిపిస్తున్న ఊహాగానాలను, విపక్షాల జ్యోస్యాలను కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ కొట్టిపడేశారు. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని మనీష్ హైదరాబాద్ లో మీడియాతో చెప్పారు. 2014లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్, దేశం ముందుకు వెళతాయని చెప్పారు.
దేశ భద్రత విషయంలో యూపీఏ ప్రభుత్వం కఠినంగా వ్యహరిస్తుందని చెప్పారు. విపక్షాలు ఆరోపణలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. సున్నితమైన తెలంగాణ అంశం పరిష్కారమయ్యే వరకూ సంయమనం పాటించాలని కోరారు. అఫ్జల్ ఉరి తర్వాత కేంద్రంలోని యూపీఎ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని బీజేపీ సహా పలు పార్టీలు ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.