: గాలేలో కదం తొక్కుతున్న కోహ్లీ, ధావన్
గాలే టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. 128/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 43 ఓవర్లలో 2 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 65, కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), వన్ డౌన్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (9) వికెట్లను భారత్ తొలి రోజు ఆటలోనే కోల్పోయింది. అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 183 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో లంక వెన్నువిరిచాడు.