: టాస్ ఓడి రాణించడం మామూలు విషయం కాదు!: అశ్విన్


గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకను 183 పరుగులకే పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దే. ఈ తమిళతంబి 46 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడంతో లంక జట్టు తొలి రోజే కుప్పకూలింది. ఆట అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ... టాస్ ఓడిపోయిన పరిస్థితుల్లో రాణించడం మామూలు విషయం కాదని అన్నాడు. ముఖ్యంగా, శ్రీలంకను సొంతగడ్డపై ఒక్కరోజులోనే ఆలౌట్ చేయడం అసాధారణ ప్రదర్శనగా అభివర్ణించాడు. ఇక, తన ప్రదర్శన గురించి చెబుతూ... వ్యక్తిగత మైలురాళ్ల కోసం చూసుకోవడంలేదని స్పష్టం చేశాడు. జట్టుకు మేలు చేయాలనే కోరుకుంటానని తెలిపాడు.

  • Loading...

More Telugu News