: వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో కొనసాగుతున్న సైనా జోరు


భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండోనేషియాలో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో దూసుకెళుతోంది. బుధవారం జరిగిన రెండో రౌండ్ పోరులో సైనా 21-13, 21-9తో హాంకాంగ్ అమ్మాయి చియంగ్ యి పై అలవోకగా నెగ్గి మూడో రౌండ్ కు చేరింది. ఈ మ్యాచ్ లో సైనా తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. చియంగ్ చేసిన తప్పిదాలు కూడా సైనాకు కలిసొచ్చాయి. బలమైన స్మాష్ లు, కార్నర్ టు కార్నర్ షాట్లతో సైనా విరుచుకుపడడంతో చియంగ్ నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. రెండో గేమ్ లో సైనా వరుసగా 10 పాయింట్లు సాధించడం విశేషం.

  • Loading...

More Telugu News