: వెంకయ్యకు, మాధురీ దీక్షిత్ డ్యాన్సుకు లింకుపెట్టిన సీపీఐ నారాయణ
సునిశిత విమర్శలకు, వ్యంగ్యోక్తులకు సీపీఐ నేత నారాయణ పెట్టింది పేరు! బుధవారం తిరుపతిలో జరిగిన ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవంలోనూ తనదైన శైలిలో ప్రసంగించి రంజింపజేశారు. సభలో ప్రధాని మోదీ కనుసైగ చేస్తే చాలు... వెంకయ్యనాయుడు పెదాలు మాధురీ దీక్షిత్ డ్యాన్సు చేస్తున్న తరహాలో అందంగా కదులుతాయని అన్నారు. అంతకుమించి ఇంకేమీ ఉండదన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టంగా చెప్పకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే సర్కారు అవినీతికి వంత పాడుతోందని, బందిపోట్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఇక, కళాశాలల్లో ర్యాగింగ్ కు పాల్పడే వారిని అమ్మాయిలు చున్నీతో ఉరివేసి చంపాలని సూచించారు. అలాంటి విద్యార్థినులకు సీపీఐ, ఏఐఎస్ఎఫ్ మద్దతుగా నిలుస్తాయని తెలిపారు.