: కేటీఆర్ గన్ మన్, డ్రైవర్ కు ఏపీ సీఐడీ నోటీసులు


ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన మత్తయ్య ఇప్పుడు తెలంగాణ సర్కారుకు ఇబ్బందికరంగా మారాడు. ఈ వ్యవహారంలో తాజాగా ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు గన్ మన్ జానకీరామ్ కు , డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులు పంపారు. ఈ నెల 14న విజయవాడలో విచారణకు హాజరవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మత్తయ్యకు కేటీఆర్ గన్ మన్, డ్రైవర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. మత్తయ్య సీఎం కేసీఆర్ పై చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడలో కేసు నమోదు కాగా, ఆ కేసును ఏపీ సర్కారు సీఐడీ విభాగానికి బదలాయించింది. ఈ వ్యవహారంలో చంద్రబాబునాయుడు పేరు చెప్పాలని తనను బెదిరించారని మత్తయ్య పేర్కొనడం తెలిసిందే. నోటీసుల నేపథ్యంలో, హైదరాబాదులోని తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సీరియస్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News