: వ్యవసాయ బావిలో పడ్డ ఎలుగుబంటి


కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలంలోని గ్రామాల్లోకి తరచుగా ఎలుగుబంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏ క్షణం ఏం జరుగుతుందో అని స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. తాజాగా మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామ పరిధిలో ఉన్న ఓ వ్యవసాయ భూమిలోని బావిలో ఎలుగుబంటి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం, గ్రామస్తుల సాయంతో ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని వెలుపలకు తీశారు. ఆ తర్వాత దాన్ని అడవిలో వదిలేశారు.

  • Loading...

More Telugu News