: ఉత్తర కొరియా ఉపప్రధానికి మరణశిక్ష అమలయ్యిందా?


ఉత్తర కొరియాలో మరో హత్య జరిగింది. ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ విధానాలను వ్యతిరేకిస్తున్నాడన్న ఆరోపణతో ఉపప్రధాని చోయ్ యాంగ్ గోన్ కు మరణ శిక్ష విధించి, చంపేశారని దక్షిణ కొరియా యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 2014లో ఉపప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చోంగ్ యాంగ్ గోన్ ను 2015 మే నెలలో ఫైరింగ్ స్క్వార్డ్ తో కాల్చి చంపించినట్టు యోన్హాప్ న్యూస్ తెలిపింది. చోయ్ ను నిజంగానే జోంగ్ యున్ చంపించినట్టైతే ఉత్తర కొరియా మంత్రి వర్గంలో అధ్యక్షుడు చంపించిన రెండో మంత్రి ఆయనేనని యోన్హాప్ న్యూస్ వెల్లడించింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో రక్షణ శాఖ మంత్రి హ్యోన్ యాంగ్ చోల్ ను అధికారిక మిలటరీ ర్యాలీ సందర్భంగా నిద్రపోయాడని చంపించేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News