: ఐఎస్ పై ఆఫ్ఘన్ తాలిబాన్ల మండిపాటు


పేలుడు పదార్థాలను భూమిలో పాతి, ఆ మందుపాతరల మీద బందీలను మోకాళ్లపై కూర్చోబెట్టి రిమోట్ సాయంతో పేల్చివేసిన దృశ్యాలున్న వీడియోను ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఐఎస్ పై ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్లు మండిపడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన వ్యక్తుల కళ్లకు గంతలు కట్టి, నిర్దాక్షిణ్యంగా పేల్చివేయడం భయంకరమని, వారి దుశ్చర్యను తాము ఖండిస్తున్నట్టు తాలిబాన్ గ్రూపు పేర్కొంది. తాజా వీడియోలో కనిపించింది ఆఫ్ఘన్ పౌరులేనని, పెద్ద వయసు గిరిజన నేతలను, గ్రామీణులను పట్టుకొచ్చి చంపారని దుయ్యబట్టింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేసింది. ఇస్లామ్, ముస్లింల పేరు చెప్పి కొందరు బాధ్యతలేని వ్యక్తులు చేస్తున్న ఇలాంటి దారుణాలు సహించరానివని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఐఎస్ తో తాలిబాన్లకు పొసగడంలేదు. ఐఎస్ తాజా ఘాతుకం ఆఫ్ఘన్ గడ్డపైనే చోటుచేసుకున్నదని ఆ వీడియో ద్వారా తాలిబాన్లు తెలుసుకున్నారు. ఆఫ్ఘన్ తూర్పు ప్రాంతంలో ఐఎస్ ఈ దురాగతానికి పాల్పడి ఉంటుందని వారు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News