: వేలానికి ప్రిన్సెస్ డయానా పెళ్లి ఫోటోలు


ప్రిన్సెస్ డయానా, చార్లెస్ వివాహానికి సంబంధించిన కొత్త ఫోటోలను వేలం వేయబోతున్నారు. వచ్చే నెలలో బోస్టన్ లో వేలం జరగనుంది. వేలంలో కలర్, నలుపు- తెలుపు చిత్రాలను ఉంచనున్నారని తెలిసింది. ఆ ఫోటోల్లో డయానా తన పెళ్లి గౌనులో కుటుంబసభ్యులతో మాట్లాడుతుండగా ఉన్న దృశ్యాలు ఉన్నాయట. జులై, 1981లో బకింగ్ హామ్ ప్యాలెస్ లో జరిగిన రిసెప్షన్, తరువాత సెయింట్ పాల్ కేథడ్రాల్ నిర్వహించిన అభిమానుల కార్యక్రమాల నుంచి తీసిన ఫోటోలు వేలంలో ఉంటాయని ఆర్ఆర్ వేలం నిర్వాహకులు తెలిపారు. డయానా కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న, రాణి బంధువైన ఫోటోగ్రాఫర్ పాట్రిక్ లిచ్ఫీల్డ్ సహాయకుడి నుంచి ఫోటోలను తీసుకున్నారు. ఓ మూడు ఫోటోల్లో వివాహ సమయంలో డయానా తన తోడిపెళ్లికూతుళ్లను పట్టుకుని ఉంటుందట. మరికొన్ని ఫోటోల్లో ప్రిన్స్ చార్లెస్, క్వీన్ ఎలిజబెత్, మరో ఇద్దరు ఉంటారట. మొత్తం 14 ఫోటోలను సెప్టెంబర్ 24న బోస్టన్ ఏరియా ఆక్షన్ హౌస్ లో అమ్మకానికి పెట్టనున్నారు.

  • Loading...

More Telugu News