: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్
అనుమతులు లేకుండా ధర్నా నిర్వహించి రహదారిని దిగ్బంధం చేసిన కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పిలుపునిచ్చిన ధర్నాలో వీరంతా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ట్రాఫిక్ ఆగిపోగా, పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉత్తమ్ తో పాటు మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేశారు. నేతల అరెస్ట్ సందర్భంగా కొంత సేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వీరందరినీ బెజ్జంకి పోలీసు స్టేషనుకు తరలించిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.