: మ్యాగీ నూడిల్స్ కు అమెరికాలో క్లీన్ చిట్
భారత్ లో నిషేధం ఎదుర్కొంటున్న మ్యాగీ నూడిల్స్ కు అమెరికాలో ఊరట లభించింది. మ్యాగీ నూడిల్స్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నూడిల్స్ లో తమ ప్రజలకు హాని కలిగించే రీతిలో సీసం, ఇతర హానికారక రసాయనాలు లేవని యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్ డీఏ) క్లీన్ చిట్ ఇచ్చింది. యూఎస్ఎఫ్ డీఏ ప్రకటనతో మ్యాగీ నూడిల్స్ ఉత్పత్తి చేస్తున్న నెస్లే సంస్థ ఊపిరి పీల్చుకుంది.