: ఐపీఎల్ అనేది ఓ కుంభకోణాల పుట్ట: లోక్ సభలో అన్నా డీఎంకే సభ్యుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై లోక్ సభలో అన్నా డీఎంకే సభ్యుడు వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లలిత్ మోదీ అంశంలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐపీఎల్ కుంభకోణాల పుట్ట అని విమర్శించారు. ఐపీఎల్ లో వందల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. లలిత్ ను ఆర్థిక నేరస్తుడిగా ఈడీ ప్రకటించిందని, ఆయన్ను భారత్ కు రప్పించి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా ప్రభుత్వం మౌనం వహించడం తగదన్నారు. అవినీతిపై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.