: కేటీఆర్ ట్వీట్... మహేశ్ బాబు రీట్వీట్


తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు టాలీవుడ్ లేటెస్ట్ సినిమా 'శ్రీమంతుడు' స్ఫూర్తిదాయకమైన చిత్రం అని పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు గ్రామజ్యోతి పథకం తీసుకువస్తున్న సమయంలోనే ఈ సినిమా రావడం, ఈ సినిమాలోనూ గ్రామాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి అంశాలను సృజించడం ఎంతో బావుందని అన్నారు. "మంచి సినిమా మహేశ్ బాబూ" అంటూ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే 'శ్రీమంతుడు' హీరో మహేశ్ బాబు వినమ్రంగా స్పందించారు. "థాంక్యూ కేటీఆర్ సర్" అంటూ రీట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News