: మోదీకి భయపడుతున్న జగన్: రఘువీరా
ప్రధాని నరేంద్ర మోదీకి వైకాపా అధినేత జగన్ భయపడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో దీక్ష చేపట్టిన సందర్భంగా రాహుల్ గాంధీపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన లేమిని సూచిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ఉద్యమాన్ని ఉధ్ధృతం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా దేవినేని అవినాష్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు.