: అమెరికా పర్యటనలో మోదీని కలవాలనుకుంటున్నా: సుందర్ పిచయ్
త్వరలో అమెరికాలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవాలనుకుంటున్నట్టు గూగుల్ కొత్త సీఈఓ సుందర్ పిచయ్ తెలిపారు. గూగుల్ సీఈఓగా ఆయనను నియమిస్తూ ప్రకటించిన నేపథ్యంలో పిచయ్ కి ప్రధాని మోదీ ట్విట్టర్ లో నిన్న (మంగళవారం) అభినందనలు తెలిపారు. ఇందుకు స్పందించిన సుందర్ ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు. సెప్టెంబర్ 23న మోదీ రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిలికాన్ వ్యాలీలో వివిధ సంస్థలకు చెందిన సారథులను కూడా కలవనున్నారు. అప్పుడే తాను మోదీని కలవాలనుకుంటున్నట్టు తాజాగా పిచయ్ వెల్లడించారు.