: ఆగస్టు 15 నాటికి పట్టిసీమ ద్వారా వచ్చేది నీరు కాదు... ముడుపులే!


పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15 నాటికి తొలిదశ నీటిని అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుండటాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఆగస్టు 15 నాటికి పట్టిసీమ ద్వారా ప్రవహించేది నీరు కాదని... ముడుపులు మాత్రమే అని చెప్పారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఒక్క చుక్క నీరు కూడా అందదని అన్నారు. ఈ మాటలు కేవలం తనవి మాత్రమే కాదని... టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే చెబుతున్నారని తెలిపారు. ప్రాజెక్టులో మిగిలిపోయిన రూ. 500 కోట్లను తింటున్నారని రఘువీరా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News