: ధోనీ తీరుపై కర్ణాటక హైకోర్టు ఆక్షేపణ... అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం


షూ ధరించి, చేతిలో పలు వస్తువులు పట్టుకుని, విష్ణుమూర్తి రూపంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ఓ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించిన వ్యవహారంపై కర్ణాటక హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఆ ప్రకటనలో హిందూ దేవుడిని అగౌరవపరిచారంటూ టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై జయకుమార్ హీరేమత్ అనే సామాజిక కార్యకర్త ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ధోనీ తీరును న్యాయస్థానం ఆక్షేపించింది. ప్రజల మత విశ్వాసాలను కించపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ధోనీ తెలుసుకోవాలని కోర్టు సూచించింది. ఈయన వంటి సెలబ్రిటీలు కేవలం డబ్బు కోసం ప్రకటనల్లో నటిస్తారని, కానీ వాటి పర్యవసానాల గురించి ఆలోచించరని వ్యాఖ్యానించింది. వారి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడమేనని జస్టిస్ ఏఎన్ వేణుగోపాలన్ అన్నారు. అయితే ప్రకటనలో చేసినందుకు ధోనీ డబ్బులు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన జస్టిస్, డబ్బులు తీసుకోనట్టుగా నిర్ధారిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News