: అనంతపురంలో అక్రమ ఆయుధాలు పట్టివేత
అనంతపురంలో అక్రమ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నుంచి బళ్లారికి ఈ ఆయుధాలను తీసుకువెళుతున్న నలుగురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు బళ్లారి ఎంపీ శ్రీరాములు అనుచరులుగా భావిస్తున్నారు. తుపాకులు తరలిస్తున్న వారిని అనంతపురం పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, దీనికి సంబంధించి కేసు నమోదు చేశామని... శ్రీరాములు పేరు వినిపిస్తున్న నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.