: లోక్ సభ ప్రారంభం... లలిత్ మోదీ అంశంలో సుష్మా రాజీనామాకు కాంగ్రెస్ పట్టు


పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ మొదలైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఎప్పటిలానే ఆందోళన మొదలుపెట్టారు. స్పీకర్ పోడియంలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ లలిత్ మోదీ అంశంలో సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ పట్టుబడుతున్నారు. అయితే లలిత్ విషయంలో తాను మరోసారి వివరణ ఇచ్చేందుకు సిద్ధమని సుష్మ తెలిపారు. ఈ క్రమంలో స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంత వారించినా వినకుండా కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అంతకుముందు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించినప్పటికీ... ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12 గంటల తరువాత తీర్మానాలపై చర్చించేందుకు అనుమతిస్తానని స్పీకర్ తెలిపారు. అయినా విపక్షాలు తమ నిరసన కొనసాగిస్తున్నాయి. స్పీకర్ మాత్రం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అటు రాజ్యసభలో కూడా ఇదే తీరు కొనసాగుతోంది. కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News