: మేమెప్పుడూ అమలుకాని హామీలు ఇవ్వం: వెంకయ్యనాయుడు


తమ పార్టీ బీజేపీగానీ, తాము గానీ ఎన్నడూ అమలుకాని హామీలు ఇవ్వమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నాడు రాజ్యసభలో, తరువాత ఎన్నికల్లో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీపై ఏపీలో డిమాండ్ లు వెల్లువెత్తుతున్నా వెంకయ్య ఇంతవరకు మీడియాతో మాట్లాడలేదు. దానిని దృష్టిలో పెట్టుకునే ఏపీకి హోదా, విభజన హామీలపైనే ఆయన పరోక్షంగా ఇలా స్పందించారా? అన్న అనుమానం రాజకీయవర్గాలలో కలుగుతోంది. ఢిల్లీలో ఈ రోజు ఏపీ, తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా హామీలపై ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించారు. కాగా విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటుపై సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వేర్వేరు రైళ్లు కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు మూడు నెలలు ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చని వెంకయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News