: దక్షిణాఫ్రికాలో ఇద్దరు భారత సంతతి వ్యక్తుల దారుణ హత్య


దక్షిణాఫ్రికాలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులను కాల్చి చంపారు. ఈ ఘటన డర్బన్ సిటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, డర్బన్ లోని ఓ అపార్ట్ మెంట్ లో భారత సంతతి వ్యక్తులు మహ్మద్, అహ్మద్ అనే ఇద్దరు సోదరులు నివసిస్తున్నారు. ఇదే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఓ వ్యక్తితో వీరికి పార్కింగ్ స్థలం విషయంలో వివాదం నెలకొంది. దీనికి సంబంధించి వీరు గత కొద్ది రోజులుగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలో, పార్కింగ్ లో అహ్మద్ తన కారును పార్క్ చేసి వెళుతుండగా దుండగుడు తుపాకితో కాల్చాడు. కాల్పుల శబ్దం విన్న మహ్మద్ కిందకు రాగా అతడిని కూడా కాల్చిపారేశాడు. ఈ ఘటనలో అన్నదమ్ములు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News