: లోకేష్ డ్రైవర్ కోసం చంద్రబాబు ఇంటికి వెళ్లిన తెలంగాణ ఏసీబీ అధికారులు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి తెలంగాణ ఏసీబీ అధికారులు వెళ్లారు. ఈ ఘటన నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగింది. చంద్రబాబు కుమారుడు, తెదేపా సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేష్ కాన్వాయ్ లోని డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు తాము వచ్చామని ఏసీబీ అధికారులు తెలిపారట. కొండల్ రెడ్డిని చూపాలని కోరగా, అతను లేడని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కాగా, ఓటుకు నోటు కేసులో డబ్బులు చేతలు మారడం వెనుక కొండల్ రెడ్డి హస్తమున్నట్టు ఏసీబీ భావిస్తోంది. ఈ విషయమై గతంలోనే వార్తలు రాగా, కొండల్ రెడ్డి కోసం చంద్రబాబు ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లడం ఆ పార్టీ వర్గాల్లో కాస్తంత కలకలం రేపింది. కొండల్ రెడ్డి కోసం నిన్న టీడీపీ పార్టీ కార్యాలయానికి కూడా ఏసీబీ అధికారులు వెళ్లారు. అతను అక్కడ లేకపోవడంతోనే చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. నేడు ఆయన ఇంటికెళ్లి విచారణకు నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News