: దొంగతనం చేసి తెచ్చుకున్న డబ్బును ఇంట్లోపడి దోచుకెళ్లిన తమిళ పోలీసులు!


వారు సంచార దొంగలు. ఇంటిల్లిపాదీ పక్క రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేసొచ్చి దర్జాగా బతుకుతుంటారు. వారే కుప్పం పరిసర ప్రాంతాల్లో నివసించే 'డబ్బావోలు' తెగ. చిత్తూరు జిల్లా కుప్పం చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తుంటారు. ఎక్కడో దొంగతనం జరిగిందన్న సమాచారంతో సాధారణ దుస్తుల్లో వచ్చిన తమిళ పోలీసులు రెండు ఇళ్లపై దాడి చేసి చేతికి అందినంతా పట్టుకుపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నారాయణ, వేలు అనే 'డబ్బావోలు'కు చెందిన వ్యక్తుల ఇళ్లపై దాడి జరిగింది. ఈ ప్రాంతానికి తమిళనాడు పోలీసులు రాత్రి వేళల్లో రావడం, ఇళ్లపై పడి అందిందంతా దోచుకెళ్లడం సర్వ సాధారణమే. ఇదే క్రమంలో గత రాత్రి ఇళ్లపై పడ్డారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో, తాము వెండి ఆభరణాలు తీసుకున్నామని చెప్పి, వాటిని తిరిగి ఇచ్చి, దోచుకున్న బంగారం, డబ్బులను ఊరు దాటించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ తరహా ఘటనల్లో ఫిర్యాదులు లేకపోవడంతో తాము ఏమీ చేయలేకున్నామని ఏపీ పోలీసులు అంటున్నారు.

  • Loading...

More Telugu News