: బూటులో బంగారం... శంషాబాద్ లో 3 కిలోల పుత్తడి పట్టివేత


దొంగ బంగారం కిలోల లెక్కన దేశంలోకి తరలివస్తోంది. నిఘా వర్గాల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కాలికేసుకున్న బూట్లను ఈ అక్రమ రవాణాకు ఎంచుకున్నాడు. నీటుగా కాళ్లకు బూట్లు వేసుకున్న అతడు, వాటిలో ఏకంగా 3 కిలోల బంగారాన్ని దాచేశాడు. ఎంచక్కా దుబాయిలో విమానం ఎక్కిన అతగాడు హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టులో నేటి ఉదయం దిగాడు. అయితే ఆ స్మగ్లర్ ను శంషాబాద్ లోని కస్టమ్స్ అధికారులు పట్టేశారు. అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News