: సంజయ్ దత్ కు ఆయుధాలు ఇవ్వలేదు... టాడా కోర్టుకు అబూ సలేం సాక్ష్యం


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు అనుకూలంగా గ్యాంగ్ స్టర్ అబూ సలేం సాక్ష్యం చెప్పాడు. ఇప్పటికే ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల్లో దోషిగా తేలిన సంజయ్ దత్ కు కోర్టు శిక్ష కూడా ఖరారు చేసింది. ప్రస్తుతం అతడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బాంబు పేలుళ్లకు ముందు అబూ సలేం సంజయ్ దత్ ఇంటికి వెళ్లాడని, అక్కడ సంజయ్ కు రెండు రైఫిళ్లు, గ్రనేడ్లు అందజేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే నిన్న ముంబైలోని టాడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో అబూ సలేం పోలీసుల ఆరోపణలను కొట్టిపారేశాడు. బాంబు పేలుళ్లకు ముందు తాను సంజయ్ దత్ ఇంటికి వెళ్లలేదని తెలిపాడు. అసలు తాను సంజయ్ దత్ కు ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి ఇవ్వలేదని కూడా సలేం కోర్టుకు చెప్పారు.

  • Loading...

More Telugu News