: 'రాధే మా' వద్ద దివ్యశక్తులున్నాయి: కేంద్ర మంత్రి విజయ్ సంప్లా
భక్తులతో కలిసి బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు చేసే ఆధునికతరం ఆధ్యాత్మికవేత్త రాధే మా ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని, ఆమెకు దివ్యశక్తులు ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి విజయ్ సంప్లా పేర్కొన్నారు. రాధే మా వివాదాల్లో చిక్కుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆమె ఎప్పటికీ వివాదాస్పదురాలు కారని స్పష్టం చేశారు. పంజాబ్ లోని హోషియార్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సంప్లా తాను రాధే మా ప్రవచన శైలిని గౌరవిస్తానని తెలిపారు. "ఆమెకు దివ్యశక్తులు ఉన్నాయని గుర్తించినప్పటి నుంచి ఆమె భక్తుడిగా మారిపోయాను. నా అధికారిక నివాసంలో ఆమె భజన కూడా ఏర్పాటు చేశాను. అన్నింటికీ మించి నా నియోజకవర్గంలో ఆమె ఓటరు కూడా" అని వివరించారు. రాధే మా విషయంలో మీడియా వైఖరిని ఆయన తప్పుబట్టారు.