: రాఖీ కట్టి, అన్నల నుంచి ఆ కానుక కోరండి: మహిళలకు రాజస్థాన్ మంత్రి సూచన


భారత సంస్కృతిలో రక్షాబంధన్ కు ప్రత్యేక స్థానం ఉంది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను, కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రాఖీ పండగను ప్రభుత్వ కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ భావించారు. దీంతో 'సెల్ఫీ విత్ డాటర్' టైపులో 'సెల్ఫీ విత్ బ్రదర్' అనే పోటీ పెడుతున్నారు. రాఖీ పండగ రోజున ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, పొగాకు మానేస్తానంటూ ప్రమాణపత్రం రాయించుకోవాలని సూచించారు. ఇలా చేసిన అమ్మాయిలు ప్రమాణపత్రం పట్టుకుని సోదరుడితో సెల్ఫీ దిగి, ఆ ఫోటోను రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖకు మెయిల్ చేయాలని కోరారు. అలా సెల్ఫీలు పంపిన అమ్మాయిల్లో ఎంపిక చేసిన వారికి రాజస్థాన్ ప్రభుత్వం సన్మానం చేస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News