: మిస్ ఇండియా-కెనడా జడ్జిగా ప్రీతి జింటా


మిస్ ఇండియా-కెనడా జడ్జిగా ప్రీతి జింటా వ్యవహరించనుంది. 2015వ సంవత్సరానికిగాను మిస్ ఇండియా-కెనడా పోటీలు కెనడాలో జరుగుతున్నాయి. ఈ పోటీలకు జడ్జిగా వ్యవహరించేందుకు కెనడా వెళ్తున్నట్టు ప్రీతి జింటా ట్వీట్ చేసింది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న మిస్ ఇండియా-కెనడా పోటీలను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పోటీల్లో 16 మంది ఇండో-కెనడియన్ అందగత్తెలు ఫైనల్స్ కు చేరారు. వీరిలో ప్రతిభావంతమైన అందగత్తెను ఎంపిక చేసే న్యాయనిర్ణేతలలో ప్రీతి జింటా ఒకరు. గతంలో ఈ పోటీలకు హేమమాలిని, రవీనా టాండన్, దేవానంద్, ఆఫ్తాబ్ శివదాసని తదితర బాలీవుడ్ నటులు జడ్జిలుగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News