: ప్రత్యేక హోదాకు మించి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తామన్నారు: మంత్రి సుజనా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఢిల్లీలో ఏపీ టీడీపీ ఎంపీల భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రత్యేక హోదా పదం ఉన్నా లేకున్నా అంతకుమించి అధిక సాయం చేస్తామని జైట్లీ చెప్పారన్నారు. రాయలసీమ అభివృద్ధికి ఎక్కువ ప్యాకేజీ కోరామని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆ తరువాత ఎంపీలు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 9,10 సెక్షన్లపై ఎంపీలు చర్చించినట్టు సమాచారం.