: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మోదీ, వెంకయ్య, చంద్రబాబుపై కేసులు పెడతాం: రఘువీరా


గతంలో క్యాబినెట్ తీర్మానం ద్వారా 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా దక్కించుకున్న విషయాన్ని బీజేపీ గుర్తెరగాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ప్రణాళిక సంఘం పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటన చేయాల్సిందేనని, లేకపోతే, ఈ నెల 13 నుంచి రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుపై కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన దీక్ష ఓ డ్రామా అని మండిపడ్డారు. కేంద్రాన్ని, మోదీని ఒక్కమాట కూడా అనకుండా జగన్ దీక్ష ముగించి రాష్ట్రానికి తిరిగొచ్చేశారని విమర్శించారు. అయినా, ప్రధానిని నిలదీసే ధైర్యం జగన్ కు ఎక్కడుందని వ్యంగ్యం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News