: గాలే టెస్టుకు సిద్ధమైన టీమిండియా... సంగా కోసం స్పెషల్ ప్లాన్!


భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ కు బుధవారం తెర లేవనుంది. ఈ సిరీస్ లో రెండో టెస్టు అనంతరం లంక దిగ్గజం కుమార సంగక్కర వీడ్కోలు చెప్పనుండడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. సంగాను, మిగతా లంక జట్టు సభ్యులను కట్టడి చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. సంగాకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు లంకేయులు విజయం కోసం పోరాడుతారని, ఈ క్రమంలో తాము ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంపై దృష్టి పెడతామని చెప్పాడు. సంగాను అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలున్నాయని తెలిపాడు. గాలేలో రేపు ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఐదుగురు బౌలర్లతో బరిలో దిగుతామని స్పష్టం చేశాడు. తద్వారా, ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేయడమే తమ లక్ష్యమని చాటాడు. టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు పడగొట్టడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడీ ఢిల్లీ యువకెరటం. కాగా, లంకలో పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయన్న నేపథ్యంలో, ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతో కోహ్లీ సేన బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News