: మూడు నెలల్లో ఏపీ నుంచే పూర్తిస్థాయి పాలన జరుగుతుంది: పరకాల
వచ్చే మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన పూర్తి స్థాయిలో రాష్ట్రం నుంచే జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ విజయవాడలో మీడియా సమావేశంలో తెలిపారు. సీఎంతో పాటు మంత్రులు, కార్యదర్శులు, కమిషనర్లు వారానికి నాలుగు రోజులు విజయవాడలో ఉంటారని చెప్పారు. ఈ క్రమంలో విజయవాడకే మొత్తం అధికార యంత్రాంగాన్ని తరలించాలన్న పట్టుదలతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. దానివల్ల ప్రజలకు ప్రభుత్వం పూర్తిగా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో హైదరాబాద్ పై ఏపీ హక్కును వదులుకోబోమని పరకాల స్పష్టం చేశారు.