: మూర్ఖత్వంతో కూతుర్ని చంపుకున్న తండ్రి
సంప్రదాయాలు, మతాలు మనిషి మనుగడకు ఉపయోగపడతాయని భావించిన పెద్దలు నియమ నిబంధనలు రూపొందించారు. అవే పరమావధిగా బ్రతికేస్తున్నారు కొందరు బుద్ధి జీవులు. తాజాగా మౌఢ్యంతో కన్నకూతురిని పొట్టనబెట్టుకున్నాడో తండ్రి. వివరాల్లోకి వెళ్తే... దుబాయ్ లో ఓ తండ్రి తన కుమార్తెను తీసుకుని ఓ సాయంకాలం సరదాగా సముద్ర తీరానికి వచ్చాడు. కాస్సేపయ్యాక కూతురు ముచ్చట పడుతుంటే ఇద్దరూ కలసి నీటిలోకి వెళ్లారు. అలలతాకిడికి ఇద్దరూ లోపలికి కొట్టుకుపోయారు. దీనిని గమనించిన బే గార్డ్స్ (రక్షక సిబ్బంది) పరుగున వచ్చి వారిని రక్షించబోయారు. తమను రక్షించేందుకు వస్తున్న ఇద్దరూ పురుషులే అని గమనించిన తండ్రి వారికి చేయి అందించవద్దని, సముద్రంలో మునిగిపోవాలని సూచించాడు. దీంతో ఆ కుమార్తె తండ్రి మాటను పాటించి సముద్రంలో మునిగి మరణించింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకలా చేశావంటూ ప్రశ్నించగా, యవ్వనంలో ఉన్న తన కుమార్తెను పరపురుషుడు తాకితే ఆమె ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని, అంతకంటే చావు మేలు అని భావించి అలా చెప్పానని ఆమె తండ్రి సమాధానం చెప్పాడు.