: అంచనాలను మించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విశ్లేషకుల అంచనాలకు మించిన ఫలితాలను నమోదు చేసింది. ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో బ్యాంకు నికర లాభం 2014-15తో పోలిస్తే 10.2 శాతం పెరిగి రూ. 3,692 కోట్లకు చేరింది. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం, నిర్వహణా లాభాలు తగ్గినప్పటికీ, ఆ ప్రభావం మొత్తం గణాంకాలపై పడలేదు. అంతకుముందు మార్కెట్ నిపుణులు నికర లాభాలు రూ. 3,500 కోట్లుగా ఉండవచ్చని అంచనాలు వేశారు. కాగా, నికర వడ్డీల ఆదాయం 3.6 శాతం వృద్ధితో సరిపెట్టుకుని రూ. 13,732 కోట్లకు చేరింది. మొత్తం రూ. 13.14 లక్షల కోట్ల అడ్వాన్సులు ఇచ్చామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది 6.6 శాతం అధికమని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకులో డిపాజిట్లు 13.72 శాతం పెరిగి రూ. 16.1 లక్షల కోట్లకు చేరాయని వివరించింది. వడ్డీలపై మార్జిన్ 3.54 శాతం తగ్గిందని పేర్కొంది. నిర్వహణా లాభం 4.7 శాతం పెరిగి రూ. 9,202 కోట్లకు చేరిందని తెలిపింది.

  • Loading...

More Telugu News