: ఆయన ప్రశంసలను స్వీకరించే ధైర్యం చేయలేను: రాజమౌళి


అద్భుత జానపద చిత్ర కావ్యం 'బాహుబలి' ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రరాజం దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. ఆ సినిమాను చూసిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జక్కన్నపై ప్రశంసల జడివాన కురిపిస్తున్నారు. తాజాగా, తమిళ సినీ కవి వైరముత్తు బాహుబలిని చూసి అచ్చెరువొందారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఆయన వేనోళ్ల కొనియాడడం విశేషం. భారీ ఎత్తున కవితాక్షరాలు ఉపయోగించి ఈ దర్శకధీరను తనదైన శైలిలో ప్రశంసించారు వైరముత్తు. రాజమౌళిలో భావుకత ఉన్న వ్యక్తి ఉన్నాడని, సినిమాలో తమన్నాను ప్రభాస్ చూడగానే వారు సీతాకొకచిలుకల్లా మారిపోయి గాల్లోకి ఎగిరిపోయినప్పుడే ఆ విషయం తనకు అర్థమైందని తెలిపారు. రేపన్న రోజున భారతీయ సినిమాకు చిరునామాగా రాజమౌళి పేరే చెబుతానని తన అభిమానాన్ని ప్రదర్శించారు. అందుకు రాజమౌళి బదులిస్తూ... వైరముత్తు గారు మహోన్నతులని, అలాంటి గొప్ప వ్యక్తి నుంచి వచ్చిన ప్రశంసలను స్వీకరించే ధైర్యం చేయలేనని ట్వీట్ చేశారు. ఆ ప్రశంసలను ఓ దిగ్గజం నుంచి అందిన దీవెనలుగా భావిస్తానని, ఓ గొప్ప గురువు నుంచి విద్యార్థికి దక్కిన దీవెనలు అనుకుంటానని వినమ్రంగా తెలిపారు.

  • Loading...

More Telugu News