: పోర్న్ సైట్లను ఇప్పటికే నిషేధించిన చైనా... అశ్లీల పాటలను కూడా నిషేధించింది


అశ్లీలతపై కమ్యూనిస్టు దేశమైన చైనా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే చైనాలో పోర్న్ సైట్స్ పై నిషేధం ఉంది. తాజాగా, అశ్లీల పాటలపై కూడా నిషేధం విధించింది. ఈ మేరకు సామాజిక సాంస్కృతిక సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా అభ్యంతరకరంగా ఉన్న 120 పాటలను వెంటనే వెబ్ సైట్ల నుంచి తొలగించాలంటూ ఆ పాటల వివరాలను విడుదల చేసింది. ఈ పాటలన్నీ సామాజిక విలువలకు భంగం కలిగించేలా ఉన్నాయని, హింస, నేరాలను ప్రేరేపించేలా ఉన్నాయని తెలిపింది.

  • Loading...

More Telugu News