: కలిసికట్టుగా ఉండి కేంద్రం మెడలు వంచుదాం: జగన్


పరిశ్రమలు, ఉద్యోగాలు రావని, రాష్ట్రం నష్టపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టడం లేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆరోపించారు. తిరుపతిలో ప్రత్యేకహోదా కోసం జరిగిన ఆందోళనలో ఆత్మాహుతికి పాల్పడిన మునికోటి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునికోటి కుటుంబానికి పది లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఒకమాట మాట్లాడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మరొక మాట మాట్లాడతారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోతే టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేసి, ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయాలని ఆయన సూచించారు. చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్న తన విధానం మార్చుకుని, కేంద్రంలా మభ్యపెట్టడం మానాలని ఆయన అన్నారు. అందరం కలిసి కట్టుగా ఉండి కేంద్రం మెడలు వంచుదామని అన్నారు. దయచేసి ఎవరూ ప్రాణత్యాగం చేయవద్దని ఆయన సూచించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుకుతున్నారని, అందుకే 14వ ఆర్థిక సంఘం పేరు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News