: రాజ్యసభలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం... సభ రేపటికి వాయిదా
రాజ్యసభలో ఈ రోజు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను బిల్లు)ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన చేస్తుండగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బిల్లును ప్రవేశపెట్టారు. ఎప్పటిలానే బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జీఎస్టీ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.